News July 23, 2024
జనసేన ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై హైపర్ ఆది స్పందన

తనకు జనసేన నుంచి MLC ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. పవన్ సంతోషంగా ఉంటే దూరం నుంచి చూస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని ఆది వ్యాఖ్యానించారు. ఇక అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ ఆపాలని ఆయన కోరారు.
Similar News
News December 3, 2025
స్టేడియాల్లో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా?

తమ ఆరాధ్య క్రికెటర్లను కలిసేందుకు ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు. గ్రౌండ్లలోకి దూసుకెళ్లి ప్లేయర్ల కాళ్లపై పడుతున్నారు. మొన్న కోహ్లీ, నిన్న హార్దిక్‌పై ఫ్యాన్స్ విపరీత అభిమానం చూపారు. దీంతో జాతీయ స్థాయి ప్లేయర్లు ఆడే స్టేడియాల్లో సెక్యూరిటీపై క్రీడా వర్గాల నుంచి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలా దూసుకొచ్చేవారి వల్ల ఆటగాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని నిలదీస్తున్నాయి. మీరేమంటారు?
News December 3, 2025
యుద్ధానికి మేము సిద్ధం: పుతిన్

గతంలో చెప్పినట్లు యూరప్ దేశాలతో యుద్ధం చేయాలని రష్యా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఒకవేళ తమపై పోరాటం చేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ వార్ ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు తెచ్చి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. వాటికి శాంతియుత ఎజెండా లేదని ఆరోపించారు.
News December 3, 2025
డిసెంబర్ 03: చరిత్రలో ఈ రోజు

1884: భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ జననం (ఫొటోలో)
1889: స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరాం బోస్ జననం
1971: భారత్, పాకిస్థాన్ మూడో యుద్ధం ప్రారంభం
1979: హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ మరణం
2009: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి మరణం
2011: హిందీ నటుడు దేవానంద్ మరణం
* అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం


