News January 14, 2026
HZB: కొత్తకొండ జాతరకు బస్సులను ప్రారంభించిన డీఎం

కొత్తకొండ జాతరకు వెళ్లే భక్తుల కోసం హుజూరాబాద్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30గా ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2026
కోటప్పకొండకు వెళ్తున్నారా? ఈ నంబర్ నోట్ చేసుకోండి!

కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల రక్షణ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. దొంగతనాలు, వేధింపుల నివారణకు మఫ్టీలో క్రైమ్ టీమ్‌లను మోహరించారు. స్నానాల ఘాట్ల వద్ద చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా తప్పిపోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీస్ అవుట్‌పోస్ట్‌లను గానీ, 9440900885 నంబర్‌ను గానీ సంప్రదించాలని ఆయన కోరారు.
News February 15, 2026
కెప్టెన్సీ నుంచి ధోనీని బలవంతంగా తప్పించిన బీసీసీఐ!

2017లో భారత జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడానికి గల కారణాలను మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే తాజాగా వెల్లడించారు. కెప్టెన్‌గా దిగిపోవాలని అప్పటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్, తాను కోరినట్లు తెలిపారు. అందుకు MS అంగీకరించారని, రాతపూర్వకంగా తెలియజేయాలని కోరితే ఈమెయిల్ పంపారని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీకి మద్దతుగా నిలిచారని కొనియాడారు. 2014లో టెస్టులకు, 2020 ODI, T20లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.
News February 15, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఓవర్ స్పీడ్ 1,189, హెల్మెట్ లేకుండా 1,075, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 260 కేసులతో పాటు 1,069 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,908 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


