News January 28, 2025

HZB: బ్యాడ్ డే.. నిన్న ఒక్కరోజే నియోజకవర్గంలో 3 యాక్సిడెంట్స్

image

KNR జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నిన్న ప్రమాదాలకు అడ్డాగా మారింది. సోమవారం నియోజకవర్గంలో 3 యాక్సిడెంట్స్ జరిగాయి. కమలాపూర్ మండలంలో బస్సు, ట్రాలీ ఢీకొనగా 13 మంది గాయపడ్డారు. HZB మండలం రంగాపూర్‌లోని జూపాక క్రాస్ రోడ్డులో రెండు బైకులు ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి. HZB మండలం మందాడిపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. HZBకు సమీపంలోని ఎల్కతుర్తిలో లారీ ఢీకొని ఒకరు మృతిచెందడం గమనార్హం.

Similar News

News July 9, 2025

చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌కు బంగారు పతకం

image

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో నిర్వహించిన రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ ప్రతిభ కనబరిచారు. మెడికల్ లీగల్ టెస్ట్‌లో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్‌ను సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీమ్ రావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ అభినందించారు.

News July 8, 2025

ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

image

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News July 8, 2025

పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

image

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.