News November 9, 2024
HZB: రేవంత్ రెడ్డి నన్ను చంపినా పర్వాలేదు: కౌశిక్ రెడ్డి
దళిత బిడ్డల కోసం పోరాడుతున్న తనను సీఎం రేవంత్ రెడ్డి చంపినా పర్వాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పేద దళితులకు రూ.12 లక్షలు ఇస్తానని చెప్పారని, ఏమైందని ప్రశ్నిస్తే తన చేయి విరగొట్టారని వాపోయారు. తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. రెండో విడత దళిత బంధు ఇచ్చే వరకు పోరాటం ఆపేదే లేదన్నారు.
Similar News
News November 14, 2024
కరీంనగర్: గ్రూప్-3 ప్రశ్న పత్రాలకు కట్టుదిట్టమైన బందోబస్తు
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.
News November 14, 2024
KNR: పిల్లలు దైవానికి ప్రతిరూపాలు: కలెక్టర్
పిల్లలు దైవానికి ప్రతిరూపమని, వారిని సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 80 శాతం పిల్లల భవిత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు.
News November 14, 2024
KNR: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్కి వినతి
కరీంనగర్ నియోజకవర్గంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్ట్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చెర్లబూత్కూర్ మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్ తదితరులున్నారు.