News October 16, 2025
HZB: ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

హుజూరాబాద్ మండలం రాంపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన యువకుడు చింటూ విలాసాగర్ నుంచి పెద్దపాపయ్యపల్లెకు ఇసుకను తరలించి తిరిగి వస్తున్న క్రమంలో అతివేగం కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టి ప్రమాదం జరిగింది.
Similar News
News October 16, 2025
జూబ్లీబైపోల్: 3 రోజుల్లో 35 నామినేషన్లు.. 21 వరకు మరెన్నో?

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు 3రోజుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో 35 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇంకా 21 వరకు టైమ్ ఉంది. అంటే ఈ రోజుతో కలిపి ఆరు రోజులన్నమాట. అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విషయమేంటంటే ప్రధాన పార్టీల్లో BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్ వేయలేదు. ఒక్క BRS తప్ప. ఎంతమంది పోటీకి సిద్ధమవుతారో చూడాలి మరి.
News October 16, 2025
పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్

పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన 4వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వీసీ శ్రీనివాస్ ఉన్నారు.
News October 16, 2025
PIC OF THE DAY

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.