News January 29, 2025
HZB: విద్యార్థిని ఆత్మహత్య

హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన సాయి చందన(21) ఈనెల 26న హాస్టల్లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థులు, యాజమాన్యం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
Similar News
News September 13, 2025
KNR: సమగ్ర శిక్ష వ్యాయమ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్

సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వంగ ప్రకాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సొల్లు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా రజితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంగ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పారు.
News September 13, 2025
KNR: ప్రజాభవన్ ముట్టడిస్తాం: USFI

USFI నగర కమిటీ సమావేశం KNR సిటీలోని ఓ డిగ్రీ కళాశాలలో నగర అధ్యక్షుడు బుస మణితేజ అధ్యక్షతన సమావేశం జరిగింది. USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యారంగంపై సరైన సదస్సు పెట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
News September 13, 2025
KNR: ‘ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం విషయాలపై అవగాహన వస్తోంది’

రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన వస్తోందన్నారు. మహిళ తనతోపాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని సూచించారు.