News September 14, 2025
HZB: సైబర్ నేరగాళ్లను తెలివిగా బోల్తా కొట్టించిన తల్లి

సైబర్ నేరగాళ్ల నుంచి KNR(D) HZBకు చెందిన సుస్రత్ అనే మహిళ తెలివిగా తప్పించుకుంది. ఆమె కూతురు పోలీసుల కస్టడీలో ఉందని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. కేసు పరిష్కారం కోసం వెంటనే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట్లో భయపడినప్పటికీ, ఆమె వెంటనే తేరుకుని తన కూతురు చదువుతున్న కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమె కూతురు క్షేమంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
కౌరవుడే అయినా.. అన్యాయాన్ని ఎదురించాడు!

మహాభారతంలో ఎందరికో తెలియని పాత్రలెన్నో ఉన్నాయి. అందులో వికర్ణుడి పాత్ర ఒకటి. ఆయన కౌరవుడే అయినప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణం వంటి అధర్మ కార్యాలను వ్యతిరేకించాడు. ధ్రుతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు నిలబడి చోద్యం చూసినా వికర్ణుడు ఊరుకోలేదు. కౌరవ అగ్రజుడైన ధుర్యోదనుడినే ఎదురించాడు. కానీ, రక్త సంబంధానికి కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాడు. భీముడితో తలపడి వీరమరణం పొందాడు.
News September 14, 2025
కొత్తగూడ: చంటి బిడ్డతో ఓ తల్లి నిరసన

కొత్తగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వెజ్, కాంటిజెంట్ కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో ఒక మహిళ తన చంటి బిడ్డతో వర్షంలో గొడుగు పట్టుకుని నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నిరసనలు కొనసాగుతున్నాయి.
News September 14, 2025
బిజినేపల్లి అత్యధిక వర్షపాతం నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బిజినేపల్లి మండల కేంద్రంలో 70.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యంగంపల్లి 48.5, కొండారెడ్డిపల్లి 45.0, పాలెం 35.5, మంగనూర్ 32.8, తెలకపల్లి 29.5, కిష్టంపల్లి 17.0, తోటపల్లి 15.0, ఉప్పునుంతల 7.5, కొల్లాపూర్ 11.3, లింగాల 6.8, ఐనోల్ 6.5, కల్వకుర్తి 3.0, ఊర్కొండ 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.