News December 20, 2024

పాక్‌తో మెరుగైన బంధానికి ఓకే చెప్పా: యూనస్

image

పాకిస్థాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీక‌రించిన‌ట్టు బంగ్లా ప్ర‌భుత్వ చీఫ్ మ‌హ్మ‌ద్ యూన‌స్ వ్యాఖ్యానించారు. ఈజిప్ట్‌లో జ‌రిగిన ఓ కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా పాక్ PM షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను యూన‌స్ క‌లిశారు. 1971 యుద్ధ త‌రువాత ఇస్లామాబాద్‌తో అప‌రిష్కృతంగా ఉన్న అంశాలను ప‌రిష్క‌రించుకోవాల‌ని యూనస్ కోరుకున్నారు. ద్వైపాక్షిక బంధాల మెరుగుకు ఇరు దేశాలు సంయుక్తంగా క‌ట్టుబ‌డి ఉన్నాయని ష‌రీఫ్ కూడా పేర్కొన్నారు.

Similar News

News October 30, 2025

కాలుష్యం కాటుతో ఇండియాలో 17 లక్షల మంది మృతి

image

పెట్రోల్, డీజిల్ వంటి వినియోగంతో వెలువడుతున్న కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 లక్షల మంది బలైనట్లు ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒక్క ఇండియాలోనే 17 లక్షల మంది మరణించినట్లు వివరించింది. 2010తో పోలిస్తే మరణాలు 38% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇంధన వాడకం 2016 కన్నా 21% పెరిగిందని తేల్చింది. ఢిల్లీ వంటి చోట్ల కాలుష్యం స్థాయులు పెరుగుతుండడంతో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News October 30, 2025

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పెంచారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 10 వరకు, తప్పుల సవరణకు 12-14 తేదీల్లో అవకాశం కల్పించారు. అర్హత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది.

News October 30, 2025

రాహుల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

image

ఓట్ల కోసం మోదీ <<18140008>>డాన్స్<<>> కూడా చేస్తారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై BJP తీవ్రంగా స్పందించింది. బిహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. ‘రాహుల్‌వి అత్యంత అవమానకర, అసభ్య వ్యాఖ్యలు. అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. PM వ్యక్తిత్వంపై దాడి చేయడమే’ అని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, రాహుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.