News May 11, 2024
నేను ఓడిపోతానని ముందే తెలుసు: ఎర్రబెల్లి

TG: అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ‘ఎన్నికలకు 3 నెలల ముందే సీటు మార్చాలని కేసీఆర్‌ను కోరా. బీఆర్ఎస్‌కు 40 సీట్లు మాత్రమే వస్తాయని, మరో 20 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని కూడా చెప్పా. ప్రజల అభిప్రాయం నాకు తెలుసు’ అని ఎర్రబెల్లి వెల్లడించారు. కాగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
Similar News
News December 3, 2025
WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.
News December 3, 2025
వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News December 3, 2025
స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.


