News March 20, 2024
ఆయనకు నేనొక భక్తుడిని: ధనుష్

ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బయోపిక్‌లో నటించాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపారు. రజనీకాంత్, ఇళయరాజా అంటే తనకు ఇష్టమని.. వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని కోరుకున్నట్లు చెప్పారు. వీటిలో ఓ కల ఇప్పుడు నెరవేరిందన్నారు. ఇళయరాజాకు తానొక భక్తుడినని.. సీన్లో నటించే ముందు ఆయన మ్యూజిక్ వింటానని తెలిపారు.
Similar News
News September 9, 2025
నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నేపథ్యం

C.P.రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్‌లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP నుంచి MPగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్ అయ్యారు. 2024లో TG గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్‌గా పని చేశారు.
News September 9, 2025
బ్రెవిస్ జాక్‌పాట్.. ఏకంగా రూ.8 కోట్లు

సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్‌పాట్ కొట్టారు. SA20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీగా గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం IPLలో చెన్నై తరఫున ఆడుతున్నారు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడుగు దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది.
News September 9, 2025
మూడు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.