News November 18, 2024

నేను భారతీయులకు గులాంను: కిషన్ రెడ్డి

image

TG: తనను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటలీకి, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్‌ను కాదని దుయ్యబట్టారు. అదానీ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అదానీతో రేవంత్ చర్చలు జరపడం లేదా అని ప్రశ్నించారు.

Similar News

News November 23, 2025

SRD: డీసీసీ పదవి.. ముగ్గురు మొనగాళ్లు!

image

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను శనివారం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్, సిద్దిపేట జిల్లాలను సైతం ఈ జాబితాలో చేర్చారు. సంగారెడ్డి DCC అధ్యక్ష పదవిని పెండింగ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ఆశావహుల కోసం ముగ్గురు కీలక నేతలు పావులు కదపడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం తర్జనభర్జన పడి చివరకు SRDని పక్కన పెట్టారు.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>