News October 13, 2025
యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని: ట్రంప్

యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరి అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘శాంతి కోసం కృషి చేసినందుకు నేనెప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే నా దౌత్యం లక్ష్యం. అంతేకానీ అవార్డుల కోసం కాదు. మిలియన్ల ప్రాణాలను కాపాడాను’ అని తెలిపారు. గాజా యుద్ధం కూడా ముగిసిందని, ఇది తాను పరిష్కరించిన 8వ వార్ అని పేర్కొన్నారు. అఫ్గాన్-పాక్ ఘర్షణల గురించి తెలిసిందని, దానిపైనా దృష్టి పెడతానన్నారు.
Similar News
News October 13, 2025
టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

టెస్ట్ క్రికెట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు(A) కంటే టీమ్(B) 200, అంతకంటే ఎక్కువ పరుగుల వెనుకంజలో పడితే ఫాలో ఆన్ రూల్ వర్తిస్తుంది. ఆ టైంలో A జట్టు 2వ ఇన్నింగ్స్‌కు బదులుగా B జట్టును మళ్లీ బ్యాటింగ్‌కు పిలవొచ్చు. ఫాలో ఆన్ విధించడం A జట్టు కెప్టెన్ ఇష్టం. మళ్లీ బ్యాటింగ్ చేయకుండా ప్రత్యర్థి జట్టును ఓడించగలమనే నమ్మకంతో దీన్ని ఎంచుకుంటారు. ఫాలో ఆన్‌లో జట్ల బ్యాటింగ్: A(1), B(1), B(2), A(2)
News October 13, 2025
ఇంటర్వ్యూతో ICAR-NMRIలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ICAR-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాంట్రాక్ట్ పద్ధతిలో 4యంగ్ ప్రొఫెషనల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు ఈనెల 28న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://nmri.res.in/
News October 13, 2025
కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట దుర్ఘటన దర్యాప్తును సుప్రీంకోర్టు CBIకి అప్పగించింది. SEPT 27న కరూర్‌లో జరిగిన తమిళ వెట్రి కట్చి అధినేత విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం SIT దర్యాప్తుకు ఆదేశించింది. TN అధికారులే దర్యాప్తు చేయడంపై విజయ్ సహా కొందరు అభ్యంతరం తెలుపుతూ SCని ఆశ్రయించారు. దీంతో జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియా బెంచ్ CBI దర్యాప్తుకు నేడు ఆదేశించింది.