News January 5, 2025
నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా: సీతక్క
‘నేను ఎంత సున్నితమో, అంతే కఠినంగా కూడా ఉంటా’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఆదివారం HYDలో DPOలతో సమావేశమైన ఆమె గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. తప్పులను సరిదిద్దుకొని విధుల్లో వేగం పెంచాలని సూచించారు. PR శాఖను ఫ్యామిలీగా భావిస్తానని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News January 7, 2025
టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు!
AP: మెరుగైన పనితీరు కనబరిచిన టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా తీసుకురాబోయే బదిలీల చట్టంలో దీని ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. ప్రోత్సాహం లేకపోతే పనిలో పోటీ ఉండదని విద్యాశాఖ భావిస్తోంది. అటు బదిలీలకు విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పాయింట్ల విధానం కచ్చితంగా అమలు చేస్తారా? అనేదానిపై స్పష్టత లేదు.
News January 7, 2025
శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఇవాళ కిమ్స్ ఆస్పత్రికి ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్తే ముందే తమకు సమాచారం ఇవ్వాలని ఆయనకు పోలీసులు <<15079293>>నోటీసులు<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 7, 2025
వరికి బీమా గడువు 15 వరకు పొడిగింపు
AP: వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. వీటికి కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది 43.82 లక్షల మంది రైతులకు బీమా లభించగా, ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని పేర్కొంటున్నారు.