News September 6, 2025
అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా: బన్ని

దుబాయ్‌లో జరిగిన SIIMA వేడుకలో అందుకున్న బెస్ట్ యాక్టర్(మేల్) అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎల్లప్పుడూ ప్రేమ, గుర్తింపు అందిస్తున్నందుకు SIIMAకి ధన్యవాదాలు. వరుసగా మూడు అవార్డులు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ సుకుమార్, పుష్ప టెక్నీషియన్స్, నిర్మాతలు, చిత్ర బృందం వల్లే ఇది సాధ్యమైంది’ అని బన్ని రాసుకొచ్చారు.
Similar News
News September 6, 2025
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత ఆర్చర్లు వెన్నం సురేఖ, రిషభ్ యాదవ్ సత్తా చాటారు. సెమీ ఫైనల్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చైనీస్ తైపీ జట్టుపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల తేడాతో నెగ్గారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌ను వీరు ఎదుర్కొంటారు.
News September 6, 2025
GST ఎఫెక్ట్.. ఫార్చునర్‌పై రూ.3.49 లక్షల తగ్గింపు

జీఎస్టీ శ్లాబుల మార్పుల వేళ <<17624320>>టాటా<<>>, మహీంద్రా బాటలోనే టొయోటా కూడా కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫార్చునర్‌పై అత్యధికంగా రూ.3.49లక్షల వరకు తగ్గనున్నట్లు తెలిపింది. గ్లాంజాపై రూ.85,300 వరకు, టైసోర్‌పై రూ.1.11 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.8లక్షల వరకు, హైలక్స్‌పై రూ.2.52లక్షల వరకు, వెల్‌ఫైర్‌పై రూ.2.78లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇవి ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయంది.
News September 6, 2025
మాక్రాన్‌కు మోదీ ఫోన్.. వివిధ అంశాలపై చర్చ

ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగడంపై చర్చించినట్లు చెప్పారు. అంతర్జాతీయ అంశాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేపట్టాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా మాట్లాడినట్లు మోదీ వెల్లడించారు.