News April 3, 2024
నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నా: బీజేపీ ఎంపీ

తాను గత 6 నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నానని బిహార్ మాజీ సీఎం, బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకు ఇదే సరైన సమయమని భావించానని, లోక్‌సభ ఎన్నికల్లో తాను పాల్గొనలేనని ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని పీఎం మోదీకి తెలియజేశానన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.
Similar News
News December 5, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 60 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్‌లో 33, సెంట్రల్ జోన్‌లో 19, వెస్ట్ జోన్‌లో 3, ఈస్ట్ జోన్‌లో 2 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


