News March 1, 2025
కడప రిమ్స్‌కు పోసాని

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
Similar News
News March 1, 2025
కేరళలో వరుస హత్యలు.. కారణమిదే!

కేరళలో ప్రేయసితో సహా నలుగురు కుటుంబ సభ్యులను <<15571171>>దారుణంగా హత్య<<>> చేసిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రూ.65 లక్షల అప్పు ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిందితుడు అఫాన్ భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేశానని పేర్కొన్నారు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరి అవుతుందని ఆమెను చంపినట్లు విచారణలో వెల్లడించారు.
News March 1, 2025
రెండు రోజులు సెలవులు

AP: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ శుభవార్త చెప్పారు. వారు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.
News March 1, 2025
ఇది ప్రభుత్వం కాదు సర్కస్: KTR

TG: SLBC ఘటనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా ప్రకటన చేస్తున్నారని KTR మండిపడ్డారు. 8 మంది కార్మికుల ఆచూకీపై అధికారిక ప్రకటన చేయాలని CM రేవంత్‌ను డిమాండ్ చేశారు. ‘మృతదేహాలను గుర్తించామని ఒకరు, PM సంతాపం తెలపలేదని మరో MLA అంటున్నారు. ఇది సర్కస్‌లా ఉంది. కనీసం ఒక్కరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఇదేనా మీరు కార్మికులకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీ ప్రభుత్వంలో ప్రాణాలకుండే విలువ?’ అని ప్రశ్నించారు.