News March 20, 2024
నేను మా ఆయన భార్యను!

దేశంలో తొలి లోక్సభ ఎన్నికల్లో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేరు చెప్పలేదు. ఫలానా వ్యక్తి భార్యననో, ఫలానా వ్యక్తి కూతురుననో అని చెప్పారు. అప్పటి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆ మహిళలు అలా ప్రవర్తించారు. ఈ సమస్య ఎక్కువగా బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎదురైంది. కాగా సరైన పేర్లు చెప్పని 28 లక్షల ఓటర్లను అధికారులు తొలగించారు.
Similar News
News January 27, 2026
ఎవరు సాక్షి.. ఎవరు దోషి?

TG: BRS హయాంలో ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈక్రమంలోనే నాటి కీలక నేతలు హరీశ్ రావు, KTRను విచారించిన సిట్ ఇవాళ సంతోష్ రావును ప్రశ్నించనుంది. 2,3 రోజుల్లో కవితను కూడా విచారిస్తుందని సమాచారం. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఇప్పటికే ఆమె ఆరోపించారు. అయితే ఇప్పటివరకు పిలిచిన నేతలు సాక్షులా? నిందితులా? అసలు ఈ కేసులో దోషులెవరు? అన్నది ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలు.
News January 27, 2026
అప్పుడే ఎండలు మొదలయ్యాయ్

AP: రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం నందిగామలో గరిష్ఠంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఉత్తరకోస్తాలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం గమనార్హం.
News January 27, 2026
పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.


