News May 21, 2024

నేను నిర్దోషిని.. విచారణకు సిద్ధం: బ్రిజ్

image

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను BJP MP, WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్ కొట్టిపారేశారు. తాను నిర్దోషినని నిరూపించేందుకు తన దగ్గర సాక్ష్యాలున్నాయన్నారు. ఈ కేసులో అతడిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైంది. కాగా.. విచారణకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తనను దోషిగా తేల్చాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉందన్నారు. ఆరోపణలతో తాను MP టికెట్ కోల్పోయినా.. తన కొడుక్కి అవకాశం వచ్చిందన్నారు.

Similar News

News December 25, 2024

కారు అమ్మితే 18% జీఎస్టీ.. వీరికి మాత్రమే

image

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలపై 18% జీఎస్టీ విధించడంతో నెటిజన్లు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం రిజిస్టర్డ్ బిజినెస్ (డీలర్ల)కే వర్తిస్తుందని పేర్కొంది. వ్యక్తిగతంగా కారు అమ్మితే ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపింది. అయితే డీలర్ చెల్లించిన ఆ పన్ను మొత్తాన్ని తిరిగి కస్టమర్ నుంచే వసూలు చేస్తారని, భారం తమకే అని పలువురు మండిపడుతున్నారు.

News December 25, 2024

హైదరాబాద్ వాసుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే!

image

TG: హైదరాబాదీలు బ్రేక్‌ఫాస్ట్‌గా దోశ ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసేది హైదరాబాద్ వాసులే అని ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో వివరించింది. అలాగే ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అటు, హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది.

News December 25, 2024

పల్నాడు జిల్లాలో 1న సీఎం పర్యటన

image

AP: CM చంద్రబాబు నూతన సంవత్సరంలో తొలి రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నరసరావుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తొలుత గురజాలలో పర్యటించాలని అనుకున్నా.. BC ఎమ్మెల్యే ఉన్నచోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో నరసరావుపేటకు మార్చినట్లు తెలుస్తోంది. రొంపిచర్ల మండలం అన్నవరంలో CBN పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.