News December 29, 2024
నేను మరాఠీ.. నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్
AP: తాను మరాఠీ అయినా తన పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని చెప్పారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘సంస్కృతి, వారసత్వం అన్ని భాషతోనే ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావడం లేదు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Similar News
News January 1, 2025
SHOCKING.. ఎంత తాగావు బ్రో?
HYD బంజారాహిల్స్లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో షాకింగ్ రీడింగ్ నమోదైంది. వెంగళరావు పార్క్ సమీపంలో నిన్న రాత్రి 10.50 గంటల సమయంలో బైక్(TS09EK3617)పై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అందులో 550 రీడింగ్ వచ్చింది. దీంతో రీడింగ్ చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా, ఎంత తాగావు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 30 దాటితే కేసు నమోదు చేస్తారు.
News January 1, 2025
2025: తొలిరోజు స్టాక్మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే..
కొత్త ఏడాది తొలిరోజు దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 78,033 (-110), నిఫ్టీ 23,597 (-50) వద్ద చలిస్తున్నాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. APOLLOHOSP, LT, ASIANPAINT, INFY, BRITANNIA టాప్ గెయినర్స్. BAJAJ AUTO, ADANI PORTS టాప్ లూజర్స్.
News January 1, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్
నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.