News March 30, 2024
నేను గొర్రెను కాను: RSP

TG: ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తాను BRS పార్టీని వీడనని RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ‘కడియం, కేకే వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంతో నేను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. బహుజనవాదం, తెలంగాణవాదం కలిసేందుకే నేను KCRతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.
Similar News
News September 18, 2025
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారి 65పై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. పైనుంచి వెళ్లడంతో ఆమె శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
News September 18, 2025
BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: చైనా, పాక్

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని వింగ్ ‘మజీద్ బ్రిగేడ్’ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని UN సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా, PAK జాయింట్ బిడ్ సబ్మిట్ చేశాయి. AFG అభయారణ్యాల నుంచి ఈ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి. US గత నెలలో వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిందని.. కరాచీ ఎయిర్పోర్ట్, జాఫర్ ట్రైన్ హైజాక్లో వీటి ప్రమేయం ఉందని తెలిపాయి.