News August 22, 2025

నేను చనిపోలేదు: నటుడు

image

తాను చనిపోలేదంటూ బాలీవుడ్ నటుడు రజా మురాద్ ఏకంగా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తన మరణంపై SMలో దుష్ప్రచారం జరుగుతోందని, ఇది చూసి ఫ్యాన్స్ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారని వాపోయారు. తన మృతిపై వస్తున్న వదంతులపై స్పష్టతిస్తూ అలసిపోయానని, ఇది తీవ్రమైన విషయమన్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై అంబోలి పోలీసులను కోరారు. రజా మురాద్ ఇంద్రలో విలన్‌గా మెప్పించారు.

Similar News

News August 23, 2025

కమ్యూనిస్ట్ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

image

సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆయన 1998, 2004లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు.

News August 23, 2025

క్వాంటం వ్యాలీకి ఏపీ కేరాఫ్ అడ్రస్: CM CBN

image

AP: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ వ్యాలీని JANలో రాష్ట్రంలో ఆవిష్కరిస్తున్నామని CM CBN తెలిపారు. క్వాంటం వ్యాలీకి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే IND నం.1 కావాలని, మనదేశానికి ఆ సత్తా ఉందన్నారు. HYDలో IT అభివృద్ధి కోసం హైటెక్‌సిటీ నిర్మించామని, అమరావతిలో AI టెక్నాలజీతో క్వాంటం వ్యాలీ సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

News August 23, 2025

ఏంజెలినా సంచలన నిర్ణయం.. అమెరికాకు గుడ్‌బై!

image

ఒకప్పుడు అమెరికా అంటే ప్రతిఒక్కరి కలల ప్రపంచం. కానీ ఇప్పుడు కథ మారింది. USలో ఉండటం కంటే వేరే దేశాలకు వెళ్లిపోవడం బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు రిచర్డ్ గెరె, ఎల్లెన్ డిజెనెరెస్, ఇవా లోంగోరియా వలస వెళ్లడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆ జాబితాలో ఏంజెలినా జోలీ కూడా చేరినట్లు సమాచారం. రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న క్రైం రేట్, ఆర్థిక భారం ఈ నిర్ణయానికి కారణాలని తెలుస్తోంది.