News January 30, 2025
నేను ఎవరికీ హానికరం కాదు: DeepSeek

DeepSeek వల్ల జాతీయ భద్రతపై కలిగే ప్రభావం, పాపర్టీ థెఫ్ట్ పై US పలు అనుమానాలు లేవనెత్తింది. దీంతో అమెరికా జాతీయ భద్రతకు నీ వల్ల ముప్పు ఉందా అని DeepSeekని Way2News ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. తనకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, హ్యాకింగ్, నిఘా, దాడి చేసే సామర్థ్యాలు లేవంది. తాను ఎవరి IP మోడల్నూ దొంగిలించలేదని, లీగల్ డేటాబేస్తో నిర్మితమైనట్టు తెలిపింది.
Similar News
News November 11, 2025
విషం కలిపేందుకు లొకేషన్లలో మొయినొద్దీన్ రెక్కీ

HYD: గుజరాత్ ATS ఆదివారం అరెస్టు చేసిన Dr. SD మొయినొద్దీన్ విచారణలో భయానక కుట్ర బయటపెట్టాడు. చైనాలో MBBS చేసిన మొయిన్ ఇక్కడ ఆముదం తదితర వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషం తయారు చేస్తున్నాడు. ఈ విషాన్ని దేవాలయాలు, వాటర్ ట్యాంక్స్, ఫుడ్ సెంటర్లలో కలిపి మాస్ మర్డర్స్కు కొందరితో కలిసి ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ఇందుకు అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో రద్దీ ఫుడ్ కోర్టులు పరిశీలించాడని పేర్కొన్నారు.
News November 11, 2025
మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.
News November 11, 2025
రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


