News June 19, 2024
నేను పార్టీ మారడం లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG: తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని మండిపడ్డారు. కాగా కృష్ణమోహన్ రెడ్డితో పాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లు వార్తలు రావడంతో ఆయన స్పందించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 16, 2025
పోలీసులను బెదిరిస్తే ఊరుకోం: పవన్

AP: పోలీసు ఉన్నతాధికారులను మాజీ సీఎం బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులను బెదిరిస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్పై కేసులు వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళగిరిలో కానిస్టేబుల్స్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.
News December 16, 2025
32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.
News December 16, 2025
కౌలు రైతులకు ₹లక్ష వరకు పంట రుణం

AP: కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారు పంటలు సాగు చేసుకునేందుకు రుణాలివ్వాలని DCCBలను ఆదేశించింది. రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలి. ఎకరాకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ₹లక్ష వరకు రుణమిస్తారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. రుణాన్ని వడ్డీతో ఏడాదిలోపు చెల్లించాలి. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు రావు.


