News December 3, 2024
నేను ఆ బ్యాచ్ కాదు: నిధి అగర్వాల్

హీరోయిన్ నిధి అగర్వాల్ ట్విటర్లో ఆస్క్ నిధి పేరిట అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఓ అభిమాని మీకు తెలుగు వచ్చా అని అడగ్గా.. ‘వస్తుందండీ. ఎందుకు డౌట్? నేను ‘అందరికీ నమస్కారం’ బ్యాచ్ కాదు’ అని జవాబిచ్చారు. రాజాసాబ్‌లో ‘డార్లింగ్ ఈజ్ బ్యాక్’ అని, తమిళంలో ఈ ఏడాది అమరన్ బాగా నచ్చిందని పేర్కొన్నారు. హరిహర వీరమల్లు మూవీ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 వేగంగా విడుదలవుతుందని తెలిపారు.
Similar News
News January 6, 2026
కుంకుమ పువ్వు నుంచే ఏటా రూ.20 లక్షల ఆదాయం

ఏరోపోనిక్స్ విధానంలో తొలి విడతలో 450 గ్రాముల హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వుల్ని సుజాతా అగర్వాల్ సాగు చేశారు. తర్వాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్పత్తి క్రమంగా పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి ఒక్కో విడతకు కిలో చొప్పున 2 విడతల్లో 2 కేజీల కుంకుమ పువ్వు ఉత్పత్తి అవుతోంది. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ కావడంతో కిలోకు రూ.10 లక్షల చొప్పున ఏడాదికి రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని సుజాతా వెల్లడించారు.
News January 6, 2026
రేపు రాష్ట్ర మత్స్యకార సమాఖ్య ఎన్నికలు

AP: రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు రేపు విజయవాడ ఆప్కాఫ్ కార్యాలయంలో జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా రేపు నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితాను ప్రకటించనున్నారు. అవసరమైతే ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సమాఖ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను జిల్లా సమాఖ్యలు ఎన్నుకుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,136 మత్స్యకార సంఘాలున్నాయి.
News January 6, 2026
దేశీ ఆవుల్లో కనిపించే ప్రత్యేక లక్షణాలివే..

దేశీ ఆవుల్లో ఇతర ఆవులు, గేదెలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలుంటాయి. దేశీ గోవు తన పేడలో కూడా తను కూర్చోదు. స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. పాలు తీసేటప్పుడు గేదె తన పొదుగులో ఉన్న పాలను మొత్తం ఇచ్చేస్తుంది. ఆవు అలా కాదు. తన పిల్ల కోసం పొదుగులో కొంచెం పాలను దాచి, పిల్ల తాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. దేశీ ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఎక్కువ. గేదెలు ఎండలను తట్టుకోలేవు. ఆవులు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలవు.


