News April 22, 2024

నేను సీబీఐ విచారణకు సిద్ధం.. నువ్వు రెడీనా చంద్రబాబూ?: కాకాణి

image

AP: తాను సహజ వనరులను దోచేశానంటూ చంద్రబాబు చేసిన <<13091312>>విమర్శలపై<<>> మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘ఆ అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్ధం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరే ఆయనకు ధైర్యం ఉందా? సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తాను రండి. ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పుకోలేక నాపై విమర్శలు చేసి వెళ్లిపోయారు’ అని మండిపడ్డారు.

Similar News

News March 17, 2026

సాగర్ ఎడమ కాల్వలో మిర్యాలగూడ యువకుడి గల్లంతు

image

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగెల్లి తరుణ్ (22) బొక్కమంతులపాడు శివారులో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టలు ఉతకడానికి వచ్చిన అతడు సోమవారం సాయంత్రం ఈత కొడుతుండగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు తెలిపారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అన్న మణిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2026

11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

News March 17, 2026

బొప్పాయి పంటకు గొంగళి పురుగు చేసే నష్టం

image

బొప్పాయిలో తొలి దశ నుంచే గొంగళి పురుగు ఉద్ధృతి ఎక్కువ. గోధుమ రంగు తల్లి రెక్కల పురుగులు ఆకు కింద, లేత కొమ్మలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి 5,6 రోజుల్లో లార్వాలు వచ్చి ఆకు కింది భాగంలో పత్రహరితం గోకి తింటాయి. దీని వల్ల ఆకులు పండుబారి, గోధుమ రంగులోకి మారతాయి. బొప్పాయి పువ్వు లోపలి భాగాన్ని ఇవి తినడం వల్ల కాయల సంఖ్య తగ్గుతుంది. పిందెలను తినడం వల్ల కాయలపై మచ్చలు ఏర్పడి మార్కెట్‌లో ధర తగ్గుతుంది.