News June 17, 2024

జట్టు వైఫల్యానికి నాదే బాధ్యత: హసరంగ

image

T20WCలో జట్టు వైఫల్యానికి కారణాలు ఏమైనా తనదే పూర్తి బాధ్యత అని శ్రీలంక కెప్టెన్ హసరంగ తెలిపారు. పిచ్‌లపై నింద మోపబోనని స్పష్టం చేశారు. ఇతర జట్లూ ఇదే పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడాయని గుర్తు చేశారు. గ్రౌండ్ పరిస్థితులకు తాము అడ్జస్ట్ కాలేకపోయామని చెప్పారు. గ్రూప్-Dలో సౌతాఫ్రికా, బంగ్లా చేతుల్లో లంక ఓడిపోగా, నేపాల్‌తో మ్యాచ్ రద్దయ్యింది. నెదర్లాండ్స్‌పై మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Similar News

News November 26, 2025

ఆనంద నిలయం విశేషాలివే..

image

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 26, 2025

రాజ్యాంగం@76 ఏళ్లు

image

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

News November 26, 2025

ప్రపంచకప్ తెచ్చిన కెప్టెన్ దీపిక గురించి తెలుసా?

image

తాజాగా అంధ మహిళలు టీ20 ప్రపంచకప్‌ విజేతలైన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని సత్యసాయి జిల్లాకు చెందిన చిక్కతిమ్మప్ప, చిత్తమ్మల కుమార్తె. కర్ణాటకలో చదివిన ఆమె 8వతరగతిలో క్రికెట్లో అడుగుపెట్టారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సెంచరీ చేశారు. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమవ్వగా అదే సమయంలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.