News June 18, 2024
నేనింకా విద్యార్థినే.. ఎల్ఎల్ఎం చదువుతున్నా: సీతక్క

TG: మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ, తాను ఇంకా విద్యార్థినేనని కాంగ్రెస్ నేత సీతక్క అన్నారు. వ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్లో 18 మంది 500 వికెట్లు తీశారు.
News January 22, 2026
5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.
News January 22, 2026
28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నెల 31న మెగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్(GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) ఖాళీలను భర్తీ చేయనుంది. AP, TGలో దాదాపు 2వేల జాబ్స్ ఉండే అవకాశం ఉంది. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100.
వెబ్సైట్: <


