News September 20, 2024
నేను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని: మహేశ్‌కుమార్ గౌడ్

TG: దేశంలోని SC, ST, BC, మైనార్టీలకు న్యాయం జరగాలని పోరాడుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. అందుకే ఆయన్ను చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను రాహుల్ వదలిన బీసీ బాణాన్ని అని చెప్పారు. కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 నుంచి 23 శాతం తగ్గించిందని దుయ్యబట్టారు.
Similar News
News December 12, 2025
డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 12, 2025
నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్‌లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్‌ఫామ్‌లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.
News December 12, 2025
వాట్సాప్‌లో మరో 2 కొత్త ఫీచర్లు

మెసేజింగ్ యాప్ వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోని వారికి వాయిస్ మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. వాయిస్ కాల్ చేస్తే వాయిస్ మెసేజ్, వీడియో కాల్ చేస్తే వీడియో మెసేజ్ పంపించే వన్ టచ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వాయిస్‌మెయిల్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఫ్లక్స్, మిడ్ జర్నీల సహకారంతో కొత్త తరహా ఇమేజ్‌లను క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.


