News November 28, 2024
‘నా చావుకు నేనే కారణం’.. పరీక్షల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య
AP: అనంతపురం మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలో మెడికో వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ‘నా చావుకు నేనే కారణం. ఎవరూ బాధ్యులు కాదు. పరీక్షల ఒత్తిడిని భరించలేక చనిపోతున్నా. ఎగ్జామ్స్‌పై కాన్సన్‌ట్రేట్ చేయలేకపోతున్నా’ అని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 28, 2024
నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్
వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్‌నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్‌షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్‌గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.
News November 28, 2024
BGTలో విరాట్ పరుగుల వరద పారిస్తారు: ద్రవిడ్
BGT సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంచనా వేశారు. ‘కష్టమైన పిచ్‌లపై కూడా కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడూ ఆయన బ్యాటింగ్ బాగుంది. BGT సిరీస్‌లో తొలిమ్యాచ్‌లోనే సెంచరీ చేయడం చాలా విశ్వాసాన్నిస్తుందనడంలో డౌట్ లేదు. సిరీస్‌లో భారీగా పరుగులు చేస్తారనుకుంటున్నాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నారు.
News November 28, 2024
వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.