News September 12, 2025
దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే: చంద్రబాబు

AP: 2028 నాటికి తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తవుతుందని చంద్రబాబు Way2News కాన్‌క్లేవ్‌లో అన్నారు. ‘పేదలను నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేను 45 ఏళ్లుగా కష్టపడుతున్నాను. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే. దేశం ముందుకెళ్లడానికి ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి. సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారంటే అది మోదీ గారే. తెలుగుజాతి అన్నింటిలో నంబర్ వన్‌గా ఉండాలన్నదే నా ఆకాంక్ష’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 12, 2025
రాజకీయాల్లోకి వెళ్లను: బ్రహ్మానందం

తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని కమెడియన్ బ్రహ్మానందం అన్నారు. ఆయన ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. బ్రహ్మానందం 30ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని వెంకయ్య కొనియాడారు. తన జీవితం గురించి ఈ బుక్‌లో రాశానని బ్రహ్మానందం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చానని, లెక్చరర్‌గా పనిచేశానని చెప్పారు.
News September 12, 2025
వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. 2&3 వీలర్స్, బస్సులు, ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, కన్‌స్ట్రక్షన్, గూడ్స్ తదితర అన్ని రకాల వెహికల్స్ కచ్చితంగా వీటిని అమర్చుకోవాలని ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
News September 12, 2025
నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల

నేపాల్ తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆమె నేపాల్ తొలి మహిళా PMగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీల పేరును Gen-z యువత ప్రతిపాదించగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఆమోదించారు. నిన్నటి నుంచి ఆర్మీ సమక్షంలో నిరసనకారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేశారు. కాగా సుశీలకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశంలో విద్యనభ్యసించారు.