News January 9, 2025
చాలా బాధపడుతున్నా: సీఎం చంద్రబాబు

AP: తిరుపతిలో తొక్కిసలాట ఘటన తన మనసు పూర్తిగా కలచివేసిందని CM చంద్రబాబు అన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపచారాలూ జరగకూడదని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంగా దీన్ని ఎప్పుడూ కాపాడాలని ఒక భక్తుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆలయ పవిత్రతను కాపాడే బాధ్యతను ఎప్పుడూ తీసుకుంటానన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని TTD అధికారులతో భేటీ అనంతరం స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.
News November 21, 2025
రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.
News November 21, 2025
SBI పేరిట వెబ్సైట్.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం!

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో ఉన్న పోర్టల్‌లో పైరసీ సినిమాల లింకులు కనిపించడం కలకలం రేపింది. sbiterminsurance.com పేరిట ఓ పైరసీ వెబ్సైట్ వెలుగుచూసింది. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్&రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అయి సినిమాలు ప్లే అవుతున్నాయి. దీనిపై SBI టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


