News February 11, 2025
నేను లెక్కల్లో చాలా వీక్: దీపికా పదుకొణె

తాను కూడా ఒకప్పుడు అల్లరి పిల్లనేనని హీరోయిన్ దీపికా పదుకొణె తెలిపారు. కానీ లెక్కల్లో మాత్రం తాను చాలా వీక్ అని చెప్పారు. పరీక్షా పే చర్చలో ఆమె మాట్లాడారు. ‘నేను చదువుకునేటప్పుడు చాలా ఒత్తిడి ఉండేది. మీకూ ఇలాంటి సమస్యలు ఉంటే బయటకు చెప్పాలి. లోపల అణచివేయొద్దు. టీచర్లు, తల్లిదండ్రులు, స్నేహితులతో మీ భావాలు పంచుకోవాలి. మీరేం చేయగలరో అది 100 శాతం చేయాలి’ అని విద్యార్థులతో చర్చించారు.
Similar News
News December 3, 2025
ఏలూరు: మార్నింగ్ వాక్ చేస్తుండగా ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ శ్రీపర్రు గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఘంటసాల రంగరాజు(55), ఇందుకూరి సుబ్బారావు మార్నింగ్ వాక్ చేస్తుండగా కైకలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
News December 3, 2025
ధోనీ రూమ్లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్ఫీల్డ్లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్లో ధోనీ రూమ్ అనధికారిక టీమ్ లాంజ్లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.
News December 3, 2025
సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.


