News September 14, 2024
కోచ్ అవగానే ముందు ఆయనకే ఫోన్ చేశాను: మోర్కెల్

భారత బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆ న్యూస్ మొదటగా తన తండ్రికి కాల్ చేసి చెప్పినట్లు మోర్కెల్ తెలిపారు. ‘విషయం తెలియగానే 5 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయా. ఆ తర్వాత మా నాన్నకి ఫోన్ చేశాను. ముందుగా ఆయనకే చెప్పాలనిపించింది. భారత ఆటగాళ్లతో చాలాసార్లు పోటీ పడ్డాను. ఇప్పుడు వారితో స్నేహం పెంచుకోవాలి. కోచింగ్‌లో అది చాలా కీలకం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
News December 5, 2025
మోదీ-పుతిన్ మధ్య స్పెషల్ మొక్క.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొనగా.. వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం శుభ సూచకంగా భావిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి & అభివృద్ధికి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News December 5, 2025
14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. DEC 4తో గడువు ముగియగా.. DEC 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.


