News March 17, 2025

పుతిన్, జెలెన్‌స్కీలకు సూచన చేయగలను: మోదీ

image

రష్యా- ఉక్రెయిన్ దేశాలతో తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “పుతిన్‌తో ఇది యుద్ధానికి సమయం కాదు అని చెప్పగలను. అదేవిధంగా జెలెన్‌స్కీతో ఎన్ని దేశాలు నీతో ఉన్నా యుద్ధం ముగింపుకు పరిష్కారం లభించదని సూచించగలను” అని పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌ ఇంటర్వూలో తెలిపారు. రెండు దేశాలు చర్చలు జరిపి పరిష్కారం వెతకాలని కోరారు. యుద్ధం వల్ల గ్లోబల్ సౌత్ నష్టపోయిందని మోడీ అన్నారు.

Similar News

News March 17, 2025

ALERT.. 202 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న అనకాపల్లి జిల్లా నాతవరంలో అత్యధికంగా 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవాళ 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పల్నాడు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, కృష్ణా, విజయనగరం, అల్లూరి, కోనసీమ, NTR, పశ్చిమగోదావరి, వైజాగ్, బాపట్లలో వడగాలులు వీస్తాయని పేర్కొంది.

News March 17, 2025

బంగ్లా, రోహింగ్యాల నెట్‌వర్క్‌పై దర్యాప్తునకు సిద్ధమైన హోంశాఖ

image

అక్రమ వలసదారులు, వారు స్థిరపడేందుకు సాయపడుతున్న వారిపై దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా బంగ్లాదేశీయులు, రోహింగ్యాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. NIA, పోలీసులు చాలామందిని అరెస్టు చేసి డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అసలు వారెలా దేశంలో చొరబడ్డారు, వారికి ఎవరు సాయం చేశారు, గుర్తింపు పత్రాలు ఎవరు ఇప్పించారన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు.

News March 17, 2025

బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

image

కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతడిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయ్యాక మాత్రం ‘నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు’ అంటూ నరకం చూపించేది. వరకట్నం కేసు పెట్టి అతడిని నెలన్నరపాటు జైలుకు పంపించింది. తాజాగా బెయిల్‌పై బయటికొచ్చిన మూర్తి, ఆ బాధల్ని తట్టుకోలేక తనువు చాలించాడు.

error: Content is protected !!