News July 9, 2024
ఇక నేను తల్లిని కాలేను: నటి రాఖీసావంత్

ఇకపై తాను తల్లిని కాలేనని బాలీవుడ్ నటి రాఖీసావంత్ తెలిపారు. ‘కొద్ది రోజుల క్రితం నాకు అనారోగ్యంగా ఉండటంతో డాక్టర్లను సంప్రదించా. వారు పరీక్షించి గుండెపోటు లక్షణాలు ఉన్నాయని, నా గర్భాశయంలో 10 సెం.మీ కణితి ఉన్నట్లు తేల్చారు. సర్జరీ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. దీంతో వెంటనే నేను సర్జరీ చేయించుకున్నా. ఇక నేను తల్లిని కాలేను. ఆస్పత్రి ఖర్చులన్నీ సల్మాన్ ఖాన్ భరించారు’ అని ఆమె చెప్పారు.
Similar News
News January 26, 2026
TDR DOUBTS.. గ్రేటర్ దాటి.. HMDA అంతా చుట్టి..!

టీడీఆర్ సర్టిఫికేట్లను మునుపు కేవలం ఓఆర్ఆర్(ORR) లోపల మాత్రమే వాడేవారు. కానీ, 2022లో వచ్చిన సవరణల ప్రకారం, GHMC ఇచ్చే టీడీఆర్ కార్డులను ఇప్పుడు పూర్తి HMDA ఏరియాలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అంతేకాకుండా అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు (455A సెక్షన్ కింద) 33% కాంపౌండింగ్ ఫీజు బదులు సమాన విలువైన టీడీఆర్‌ను వాడుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.
News January 26, 2026
జనవరి 26: చరిత్రలో ఈరోజు

1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ
1957: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అవతరణ
1957: భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ జననం
1968: సినీనటుడు రవితేజ జననం
1986: హీరో నవదీప్ జననం
2001: గుజరాత్లో భూకంపం.. 20 వేల మందికిపైగా దుర్మరణం
2010: సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం
*భారత గణతంత్ర దినోత్సవం
News January 26, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి


