News April 3, 2025
నా వయసును నమ్మలేకపోతున్నాను: రష్మిక

ఈ నెల 5న 29వ పుట్టినరోజు చేసుకోనున్నట్లు హీరోయిన్ రష్మిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్ డే మంత్ అని పేర్కొంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘సికందర్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.
Similar News
News September 11, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News September 11, 2025
సోనియా గాంధీకి కోర్టులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత సిటిజన్ అవ్వకముందే ఆమె ఓటు హక్కు పొందారని, విచారణ జరపాలని న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. ‘1980లో సోనియా ఓటు హక్కు పొందారు. ఆ తర్వాత 1982లో ఎన్నికల సంఘం దాన్ని తొలగించింది. అంటే ఆమె అక్రమంగా ఓటర్ ఐడీ పొందారని స్పష్టమవుతోంది’ అని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది.
News September 11, 2025
సీఎం ఆలోచనలతో నీటినిల్వలు పెరిగాయి: నిమ్మల

AP: సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. ‘గతేడాదితో పోల్చితే వర్షపాతం తక్కువైనా భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు ఉన్నాయంటే CM వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేశారు. కరవు లేకుండా చేయడమే CM లక్ష్యం’ అని స్పష్టం చేశారు.