News December 16, 2024
కేటీఆర్ అరెస్టుపై ఏమీ చెప్పలేను: పొంగులేటి

TG: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనుమతి లెటర్‌ను ఇవాళ రాత్రి లేదా రేపు ఏసీబీకి సీఎస్ పంపిస్తారని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందని వ్యాఖ్యానించారు. తమ బాంబు తుస్సుమనేదైతే ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.
Similar News
News November 10, 2025
APEDAలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

APEDAలో 11 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, ఫుడ్ సైన్స్/ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://apeda.gov.in/
News November 10, 2025
రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్‌నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.


