News January 26, 2025

ఒత్తిడి వల్లే పరుగులు చేయలేకపోతున్నా: గిల్

image

రెడ్ బాల్ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని తనపై తాను ఒత్తిడి పెట్టుకుంటున్నట్లు శుభ్‌మన్ గిల్ తెలిపారు. దాని వల్లే కొన్నిసార్లు ఏకాగ్రతను కోల్పోయి ఔట్ అవుతున్నట్లు చెప్పారు. కర్ణాటకVSపంజాబ్ రంజీ మ్యాచులో సెంచరీ చేసిన గిల్, ఇటీవల జరిగిన BGTలో విఫలమైన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో 18.60 సగటుతో కేవలం 93 ​​పరుగులు చేశారు. దీంతో అతడిపై విమర్శలొచ్చాయి.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల జిల్లాలో తొలిదశ నామినేషన్లు 385

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 85 గ్రామాల సర్పంచ్ స్థానాలకు 539 నామినేషన్లు దాఖలు కాగా 385 నామినేషన్లను ఆమోదించారు. డబుల్ నామినేషన్ల కారణంగా మిగతా వాటిని తిరస్కరించారు. 748 వార్డులకు 1,696 నామినేషన్లు రాగా, సక్రమంగా లేని కారణంగా ఐదు నామినేషన్లను తిరస్కరించారు. డబుల్ నామినేషన్లు పోగా 1,624 నామినేషన్లను ఫైనల్ చేశారు.

News December 1, 2025

చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

image

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.