News January 25, 2025
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డా: రష్మిక

సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడినట్లు హీరోయిన్ రష్మిక చెప్పారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదన్నారు. కుటుంబమే తన బలమని, ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీతోనే గడుపుతానని పేర్కొన్నారు. షూటింగ్స్ వల్ల తనకు ఇష్టమైన చెల్లిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఆమె నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.
Similar News
News December 3, 2025
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

మనిషి మనుగడ, రక్షణకు దోహదపడుతున్న నివాసాలు, నిర్మాణాల గురించి వివరించేదే వాస్తుశాస్త్రం అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. వాస్తు అంటే వాస్తవం అని, వస్తువు అమరిక వినియోగంతో ప్రయోజనం కలిగించేదే వాస్తు శాస్త్రమని అంటున్నారు. ‘పకృతిలో జరిగే మార్పులు, సమయం, అవగాహన, అనుభవాల వ్యత్యాసాల వల్ల వాస్తు ఫలితాలలో మార్పులు సంభవించవచ్చు. వీటికి ఎవరూ అతీతులు కారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 3, 2025
GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

TG: గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
News December 3, 2025
మార్క్రమ్ సెంచరీ.. ఔట్ చేసిన హర్షిత్

భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యం వైపు సాగుతున్న సౌతాఫ్రికాను హర్షిత్ రాణా దెబ్బ కొట్టారు. తొలి వన్డే ఆదిలోనే వికెట్లు తీసిన అతడు తాజాగా సెంచరీతో చెలరేగిన మార్క్రమ్ను వెనక్కి పంపారు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని పెవిలియన్ చేర్చారు. అంతకుముందు బవుమా 46, డీకాక్ 8 రన్స్ చేసి ఔట్ అయ్యారు. RSA 30 ఓవర్లలో 197/3 చేసింది. అర్ష్దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.


