News September 14, 2024
వైద్యులు వర్షంలో ఉంటే నాకు నిద్ర పట్టలేదు: సీఎం మమత

కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనలో న్యాయం కోసం నిరసనలు చేస్తున్న వైద్యుల వద్దకు బెంగాల్ CM మమత ఈరోజు వెళ్లారు. వారు వర్షంలోనే నిరసనలు తెలుపుతుండటంతో తనకు రాత్రంతా నిద్రపట్టలేదని తెలిపారు. ‘నిరసనలు తెలియజేయడం మీ హక్కు. వాటికి సెల్యూట్ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నా పదవి కంటే మీ గొంతుకే ముఖ్యం. మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తాను. నిందితుల్ని శిక్షిస్తాను. దయచేసి విధులకు హాజరుకండి’ అని కోరారు.
Similar News
News December 1, 2025
నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News December 1, 2025
ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.
News December 1, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, డాక్యుమెంట్స్ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tcil.net.in/


