News January 6, 2025
కేవీ రావుకు నేను ఫోన్ చేయలేదు.. కాల్ డేటా చూసుకోవచ్చు: VSR

కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో తనకు సంబంధం లేదని YCP MP విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. HYDలో ఈడీ విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘KV రావుతో నాకు సంబంధం లేదు. 2020 మేలో నేను ఫోన్ చేశానని ఆయన చెబుతున్నారు. కాల్ డేటాతో చెక్ చేసుకోవచ్చు. సీపోర్ట్ విషయంలో నేనెవరికీ ఫోన్ చేయలేదు. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కేవీ రావు తిరుపతికి వచ్చి దేవుడు ముందు నిజాలు చెప్పాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
టాంజానియాలో మునుగోడు వాసి మృతి

మునుగోడు మండలం పలివెలకి చెందిన బడుగు రాజు టాంజానియాలో గుండెపోటుతో మరణించాడు. రాజధాని దారుస్సలాంలో జియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆయన, విధి నిర్వహణలో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. రాజు మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులతో వారు నిరంతరం జరుపుతున్నారు.
News December 19, 2025
e-KYC లేకపోయినా బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

TG: రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.
News December 18, 2025
మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.


