News March 21, 2024
ఏ పార్టీనీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు: మనోజ్

ఓటు వినియోగంపై మంచు మనోజ్ చేసిన <<12888614>>వ్యాఖ్యలు<<>> చర్చనీయాంశంగా మారాయి. తాజాగా దీనిపై మనోజ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏ పార్టీనీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. రాజకీయ హద్దులు దాటి.. ఐక్యత, గౌరవంతో ముందుకు సాగాలనేది తన ఉద్దేశమని తెలిపారు. లైవ్లో సాంకేతిక సమస్యల కారణంగా తాను మాట్లాడిన కొన్ని కీలక అంశాలు ప్రసారం కాలేదని, అది కాస్తా తప్పుడు అర్థాలకు దారితీసిందని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
ఈ మాసంలో ‘ప్రతిరోజు పర్వదినమే’

ఆధ్యాత్మికపరంగా మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతిరోజును పర్వదినంగానే భావిస్తారు. సూర్యుడు, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి, రథసప్తమి, మహా శివరాత్రి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు మాఘ మాసం ఎంతో అనువైనది. పెళ్లిళ్లు ఎక్కువగా మాఘ మాసంలోనే ఎందుకు జరుపుతారో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 20, 2026
ఈ ఫేస్ ప్యాక్తో ఎన్నో లాభాలు

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.
News January 20, 2026
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.


