News September 19, 2025

నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

image

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.

Similar News

News September 19, 2025

లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

News September 19, 2025

బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్.. ఏమైంది?

image

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్య కోసం చివరి వరకు అభిమానులు వెయిట్ చేశారు. ప్యాడ్లు ధరించి డగౌట్‌లో కనిపించిన SKY క్రీజులోకి ఎందుకు రాలేదని, ఆయనకు ఏమైందనే చర్చ SMలో జరుగుతోంది. కాగా, మిగతా ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే సూర్య బరిలోకి దిగలేదని తెలుస్తోంది.

News September 19, 2025

సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం. కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిట్.. చాలామందిని విచారించి కీలక సమాచారం సేకరించింది. అటు ఇప్పటికే కాళేశ్వరం కేసును విచారించాలని CBIకి లేఖ రాసిన ప్రభుత్వం తాజాగా ఈ కేసునూ అప్పగించాలనుకోవడం వ్యూహాత్మక అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.