News December 21, 2024

నేను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు: CM రేవంత్

image

TG: తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని, జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా?. కొడంగల్‌లో 1300 ఎకరాల భూసేకరణ చేసి, అక్కడి యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. నేను పులులు తిరిగే ప్రాంతం నుంచి వచ్చాను’ అని రేవంత్ అన్నారు. అటు, GHMC సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Similar News

News November 26, 2025

మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

image

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.

News November 26, 2025

ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

image

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.

News November 26, 2025

తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.