News April 14, 2025
మంత్రి పదవి కోసం పార్టీలోకి రాలేదు: వివేక్

TG: మంత్రి పదవి కోసం తాము కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు MLA ప్రేమ్‌సాగర్ చేసిన వ్యాఖ్యలపై MLA గడ్డం వివేక్ స్పందించారు. ‘ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఆహ్వానిస్తే వచ్చాం. పలు స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించాం. బీజేపీలో ఉంటే కేంద్రమంత్రి పదవి వచ్చేది. మంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరో మాట్లాడితే మాకొచ్చే నష్టం లేదు. మా కుటుంబమే ఒక బ్రాండ్’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 16, 2025
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదా?

వయసుతో సంబంధం లేకుండా ఇటీవల బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో బరువు తగ్గాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేక కొందరు బాధపడుతుంటారు. శరీరానికి అందిస్తున్న, ఖర్చు చేస్తున్న క్యాలరీలపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అలాగే, ఎంత నీరు తాగుతున్నాం? సరిపడా నిద్ర పోతున్నామా? లేదా? ఒత్తిడికి గురవుతున్నామా? అనే విషయాలు చెక్ చేసుకోవాలి. ఇవి బరువుపై ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.
News April 16, 2025
శ్రీదేవి బయోపిక్‌లో చేస్తారా?.. హీరోయిన్ రియాక్షన్ ఇదే

హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌లో చేస్తారా? అని యాంకర్ అడగ్గా.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మ(గద్దలకొండ గణేశ్) సాంగ్‌లో చేశానని చెప్పారు. హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా సూర్యతో ఈ బ్యూటీ నటించిన ‘రెట్రో’ మూవీ మే 1న రిలీజ్ కానుంది.
News April 16, 2025
ISSF వరల్డ్ కప్‌లో మెరిసిన భారత మహిళా షూటర్లు

పెరూలో జరిగిన ISSF వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు బంగారం, వెండి పతకాలతో మెరిశారు. ఉమెన్స్ 10మీ. ఎయిర్ పిస్టల్ క్యాటగిరీలో 18 ఏళ్ల సురుచి గోల్డ్ మెడల్ సాధించగా, 2024 ఒలింపిక్స్‌లో డబుల్ మెడల్ విజేత మనూ భాకర్ వెండి పతకం కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్ పతకాల తర్వాత మనూకు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి మెడల్ కావడం విశేషం. తాజాగా వీరిద్దరి ఘనత పట్ల క్రీడారంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.