News April 19, 2024
రోహిత్‌శర్మ గురించి నేనలా అనలేదు: ప్రీతీ జింటా

రోహిత్ శర్మను ఎంత ఖర్చు చేసైనా పంజాబ్ టీమ్ కెప్టెన్‌గా తీసుకొస్తానని తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ అని ఆ జట్టు ఓనర్ ప్రీతీ జింటా స్పష్టం చేశారు. ‘నేను రోహిత్‌కు బిగ్ ఫ్యాన్. అతన్ని చాలా గౌరవిస్తా. కానీ అతని గురించి నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. మా జట్టు కెప్టెన్ ధవన్ అంటే కూడా నాకు చాలా గౌరవం. ప్రస్తుతం మా టీమ్ బాగుంది. నా దృష్టంతా ఈ సీజన్ గెలవడంపైనే ఉంది’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News April 4, 2026
‘రామాయణ’కు ₹700కోట్ల ఓటీటీ ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్?

‘రామాయణ’ ఓటీటీ హక్కులపై ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ఓ సంస్థ ఏకంగా ₹700Cr ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానిని నిర్మాత నమిత్ మల్హోత్రా రిజెక్ట్ చేశారట. ₹4వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ మూవీకి ఓటీటీ రైట్స్‌ను ₹1000Crకు అమ్మాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టాక్. అలాగే రెండు భాగాలకు వేర్వేరు డిజిటల్ రైట్స్ అమ్మే ఆప్షన్‌నూ మూవీ టీమ్ పరిశీలిస్తోందట.
News April 4, 2026
మరో US జెట్‌ను కూల్చిన ఇరాన్!

ఇప్పటికే అమెరికాకు చెందిన F-35, <<19559906>>F-15<<>> జెట్‌లను కూల్చిన ఇరాన్ తాజాగా మరో ‘A-10 వార్‌థాగ్’ అనే మరో యుద్ధవిమానాన్ని కూల్చినట్లు US మీడియా వెల్లడించింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇది క్రాష్ అయినట్లు తెలిపింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కూలిన US జెట్‌ల పైలట్లను ప్రజలు ప్రాణాలతో పట్టుకుని అధికారులకు అప్పగిస్తే రివార్డ్స్ ఇస్తామని ఓ ఇరాన్ ఛానెల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
News April 4, 2026
డబుల్ ధమాకా.. సొంతగడ్డ కలిసొస్తుందా?

IPL: ఈరోజు DC vs MI, GT vs RR మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం అందనుంది. ఈ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్లకు హోంగ్రౌండ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలుపొందగా LSG-DC మ్యాచ్ నుంచి ఆ ట్రెండ్ మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు డబుల్ హెడర్‌లో గెలుపు ఎవరికి ఫేవర్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ DC, RR, MI ఖాతాల్లో ఒక విజయం ఉండగా RRపై గెలుపుతో బోణీ కొట్టాలని GT ఆశిస్తోంది.


