News March 26, 2025
టెన్త్ ఎగ్జామ్ సరిగా రాయలేదని..

TG: పది పరీక్ష సరిగా రాయలేదని తనువు చాలించిందో విద్యార్థిని. నల్గొండ(D) కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి(15) ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతోంది. సోమవారం జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
* జీవితంలో ఎగ్జామ్ ఓ భాగం మాత్రమే. పరీక్షల్లో ఫెయిలైనా లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారెందరో ఉన్నారు.
Similar News
News March 29, 2025
ఆ టికెట్లను ఆన్లైన్లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

రైలు టికెట్ల రద్దుకు సంబంధించి ఇండియన్ రైల్వే కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్లలో కొనుగోలు చేసిన టికెట్లనూ ఇకపై IRCTC వెబ్సైట్లో లేదా 139కి కాల్ చేయడం ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చన్నారు. దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గుతుందని చెప్పారు. అయితే టికెట్ రీఫండ్ కోసం ఆయా కౌంటర్ల వద్దకే వెళ్లాలని సూచించారు.
News March 29, 2025
IPL చరిత్రలో ఒకే ఒక్కడు

ఐపీఎల్ చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. నిన్న RCBతో మ్యాచులో ఈ ఘనతను అందుకున్నారు. ఈ స్పిన్ ఆల్రౌండర్ తన ఐపీఎల్ కెరీర్లో RR (2008-09), కోచి టస్కర్స్ కేరళ (2011), CSK (2012-15), గుజరాత్ లయన్స్(2016-17), CSK (2018-ప్రస్తుతం) జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటివరకు 242 మ్యాచుల్లో 3,001 రన్స్ చేసి, 160 వికెట్లు పడగొట్టారు.
News March 29, 2025
INDలో 86వేల మంది వద్ద రూ.86 కోట్ల ఆస్తి!

ప్రపంచంలో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్లు ఉన్నాయి. అమెరికాలో 9,05,413 మంది, చైనాలో 4,71,634, జపాన్లో 1,22,119, ఇండియాలో 85,698, జర్మనీలో 69,798, కెనడాలో 64,988, యూకేలో 55,667 మంది వద్ద $10Mల సంపద ఉంది.