News August 8, 2025
సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు: సంజయ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదంతా టైమ్ పాస్ వ్యవహారంలా అనిపిస్తోంది. BRS హయాంలోనే నా ఫోన్‌ను ఎక్కువగా ట్యాప్ చేశారు. సిట్ చాలా రోజులుగా విచారణ చేస్తున్నా కేసీఆర్ కుటుంబంలో ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సిట్ విచారణ కోసం బండి సంజయ్ బయల్దేరారు.
Similar News
News August 8, 2025
BREAKING: కాంతార మూవీ నటుడు మృతి

‘కాంతార’ చిత్రంలో నటించిన టి.ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడ్కాలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తొలుత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంగా సినిమాల్లోకి వచ్చారు.
News August 8, 2025
లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా?

కొందరు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘లంచ్ చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అలాగే కూల్ వాటర్, జ్యూసులు కూడా తీసుకోకూడదు. వాకింగ్ చేయకూడదు. ముఖ్యంగా లంచ్ తర్వాత సిగరెట్ తాగడం ప్రమాదకరం’ అని చెబుతున్నారు.
News August 8, 2025
Zach Vukusic: 18 ఏళ్లకే కెప్టెన్

క్రొయేషియాకు చెందిన జాక్ గ్జేవియర్ మిక్లీ వుకుసిక్ (17Y 312D) ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. దీంతో 18 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి ఆటగాడిగా వుకుసిక్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 6 T20లే ఆడటం గమనార్హం. జాక్ తర్వాత నోమన్ అంజాద్ (18Y 24D), కార్ల్ హర్ట్‌మన్లెస్లే (18Y 276D), ఎర్డెన్ బుల్గాన్(18Y 324D), డికుబ్విమానా (19Y 327D) పిన్న వయసు కెప్టెన్లుగా చేశారు.