News February 7, 2025

ఆ కామెంట్స్ నేను పట్టించుకోను: హర్షిత్ రాణా

image

ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను దించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై రాణా స్పందించారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు. అవేవీ నేను పట్టించుకోదలచుకోలేదు. నా ఆటపైనే తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టను’ అన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన తర్వాతే తాను అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దానికి ముందుగానే సిద్ధమై ఉన్నానని తెలిపారు.

Similar News

News February 7, 2025

ఇన్ఫో‌సిస్‌లో మరోసారి లేఆఫ్స్?

image

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో‌సిస్‌ మరోసారి లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వీరందరూ ఫెయిల్ కావడంతోనే ఇంటికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా నిర్వహించారని ఉద్యోగులు వాపోతున్నారు.

News February 7, 2025

సీఎంతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

News February 7, 2025

మీ డ్రీమ్స్‌లోనూ ఇవే వస్తుంటాయా?

image

మన దగ్గర ఎక్కువ మంది కలలో పాము కనిపించిందని చెప్తుంటారు. అయితే, దేశాలను బట్టి వారి డ్రీమ్స్‌లో వచ్చేవి కూడా మారుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అర్జెంటీనాలో ఎక్కువ మందికి స్పైడర్స్, AUS & కెనడా వారికి పళ్లు ఊడిపోయినట్లు, బంగ్లాదేశ్ ప్రజలకు పెళ్లి జరిగినట్లు కలలొస్తాయి. ఫ్రాన్స్ ప్రజలకు తమ మాజీ గర్ల్‌ఫ్రెండ్ డ్రీమ్స్‌లోకి వస్తుందని చెప్పారు. బ్రెజిల్ & ఆస్ట్రియా వాళ్ల డ్రీమ్స్‌లో మోస్ట్ కామన్ పామే.

error: Content is protected !!