News April 5, 2024
నా పెళ్లిపై ట్రోల్స్ పట్టించుకోను: దిల్ రాజు

తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ పట్టించుకోనని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘నా పెళ్లి తర్వాత ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నా భార్య చూసి నాకు చెప్పింది. నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటే.. విమర్శించేవారు పది వేల మంది కూడా ఉండరు. నేను ఆకాశం లాంటి వాడిని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి.. ఆ తర్వాత ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
News November 17, 2025
మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్పై SC ఆగ్రహం

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.
News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్లో 111 రన్స్కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.


